Share News

జడ్జీలను బెదిరించడం అంబటికి తగదు: కనపర్తి

ABN , Publish Date - Mar 20 , 2026 | 06:04 AM

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయమూర్తులను బెదిరించడం తగదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.

జడ్జీలను బెదిరించడం అంబటికి తగదు: కనపర్తి

ఇంటర్నెట్ డెస్క్: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయమూర్తులను బెదిరించడం తగదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘తనను రిమాండ్‌కు పంపిన న్యాయాధికారిపై హైకోర్టు రిజిస్ట్రార్‌కి ఫిర్యాదు చేస్తున్నట్లు అంబటి బహిరంగంగా మాట్లాడటం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. న్యాయమూర్తులను బెదిరించేలా మాట్లాడటం అంబటికి చట్టంపై ఉన్న ధిక్కారధోరణికి అద్దం పడుతోంది. జగన్‌ బాటలోనే అంబటి కూడా నడుస్తున్నారు’ అని అన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 06:04 AM