తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభం
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:53 AM
తాడేపల్లి పట్టణంలోని బైపాస్ రోడ్డులో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి సవిత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ..
తాడేపల్లి టౌన్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లి పట్టణంలోని బైపాస్ రోడ్డులో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి సవిత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండేలా తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. పాలకమండలితోపాటు అధికారులు ఇక్కడే ఉంటారని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయుల పేదరికాన్ని పారద్రోలడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టంచేశారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దాలనేది చంద్రబాబు ఉద్దేశమన్నారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామని చెప్పారు. 22 నెలల్లో రాష్ట్రానికి రూ.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, ఈ ఘనత అంతా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌దేనన్నారు.