Share News

కమనీయం.. శివ పార్వతుల కల్యాణం

ABN , Publish Date - Feb 06 , 2026 | 11:38 PM

పత్తికొండలో జరుగుతున్న పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్లలో భాగంగా శుక్రవారం ఆలయంలో శివపార్వతులతోపాటు బ్రహ్మేంద్రస్వామి,గోవిందమాంబల కల్యాణోత్సవం కమనీయం సాగింది.

కమనీయం.. శివ పార్వతుల కల్యాణం

పత్తికొండ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): పత్తికొండలో జరుగుతున్న పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్లలో భాగంగా శుక్రవారం ఆలయంలో శివపార్వతులతోపాటు బ్రహ్మేంద్రస్వామి,గోవిందమాంబల కల్యాణోత్సవం కమనీయం సాగింది. పండితుల వేదమంత్రోత్సవాలతో సాగిన కల్యాణంలో మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయనిర్వాహకులు భక్తులకు అన్నదానకార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. సాయంత్రం ప్రభోత్సవం నిర్వహించారు. నేడు మధ్యాహ్నం బ్రహ్మరథాంగహోమం, సాయంత్రం రథోత్సవ కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహక కమిటీ తెలిపింది.

ఆలయంలో న్యాయాధికారి ప్రత్యేక పూజలు..

పత్తికొండ మేజిసే్ట్రట్‌ కోర్టు జడ్జి జోష్ణ శుక్రవారం బ్రహ్మేంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేపూజలు చేశారు. తేరుబజార్‌లోని ఆలయం ఆర్చీ సమీపంలో న్యాయాధికారికి ఆలయ కమిటీ మేళతాళాలతో ఆహ్వానించారు. పూజల అనంతరం ఆమెను సత్కరించారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మధు, సీనియర్‌న్యాయవాదులు యల్లారెడ్డి, సురే్‌షకుమార్‌, ఆలయకమిటీ సభ్యులు తుప్పటి నాగన్న ఉన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 11:38 PM