‘ప్యాలెస్ పెద్దల’ డైరెక్షన్‌లోనే విష ప్రచారం: కాలువ
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:46 AM
రాష్ట్రంలో ఎక్కడైనా దురదృష్టకర సంఘటనలు జరిగితే సాయం చేయడం మానేసి గోతికాడ గుంటనక్కల్లా ఎదురుచూడటం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని...
అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎక్కడైనా దురదృష్టకర సంఘటనలు జరిగితే సాయం చేయడం మానేసి గోతికాడ గుంటనక్కల్లా ఎదురుచూడటం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, ఇలాంటి సమయంలో బాధితులకు అండగా ఉండాల్సింది పోయి, ప్రభుత్వంపై బురద చల్లడమే ధ్యేయంగా వైసీపీ సోషల్ మీడియా విభాగం విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రమాదాలపై ప్యాలెస్ పెద్దల డైరెక్షన్‌లోనే వైసీపీ విష ప్రచారం చేస్తోందని అన్నారు. గతంలో కర్నూలు బస్సు ప్రమాదంపై కూడా వైసీపీ ఇలాగే తప్పుడు ప్రచారం చేసి సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిందన్నారు. జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు ధైర్యముంటే శనివారం అమరావతిపై అసెంబ్లీలో జరిగే చర్చకు హాజరుకావాలని కాలువ సవాల్ విసిరారు.