ప్రశంస.. బదిలీ రెండూ ఒకే రోజు!
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:09 AM
అన్నమయ్య జిల్లా కలికిరి ఇన్‌స్పెక్టర్ కె.రామచంద్రకు గణతంత్ర దినోత్సవం రోజున వింత అనుభవం ఎదురైంది.
కలికిరి సీఐకి వింత అనుభవం
కలికిరి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా కలికిరి ఇన్‌స్పెక్టర్ కె.రామచంద్రకు గణతంత్ర దినోత్సవం రోజున వింత అనుభవం ఎదురైంది. ఉత్తమ విధి నిర్వహణలో ఆయనకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసాపత్రం లభించింది. మదనపల్లెలో సోమవారం నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ సమక్షంలో ఎస్పీ ధీరజ్ ఈ పురస్కారాన్ని అందజేశారు. దాంతోపాటు బదిలీ ఉత్తర్వులు కూడా ఇచ్చా రు. దీంతో సీఐ రామచంద్ర వెంటనే కలికిరి పోలీసుస్టేషన్ చేరుకుని విధుల నుంచి రిలీవ్ అయ్యారు. తదుపరి పోస్టింగ్ కోసం డీఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. డిసెంబరు 2న కలికిరి సీఐగా బాధ్యతలు చేపట్టిన ఆయనను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే బదిలీ చేయడం, ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.