MLA Kala Venkata Rao: వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:12 AM
వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం. వారు సిద్ధాంతం కోసం పోరాడితే, వైసీపీ నాయకులకు సిద్ధాంతమే లేదు.
కంపెనీల యాజమానులు, కాంట్రాక్టర్లకు బెదిరింపులా?: కళా వెంకట్రావు
విజయనగరం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం. వారు సిద్ధాంతం కోసం పోరాడితే, వైసీపీ నాయకులకు సిద్ధాంతమే లేదు. కేవలం బెదిరింపులకు పాల్పడడమే వారి లక్ష్యం’ అని టీడీపీ సీనియర్ నేత, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు ధ్వజమెత్తారు. విజయనగరం జడ్పీ అతిథి గృహంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై నిప్పులు చెరిగారు. పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలల నిర్మాణ, నిర్వహణకు ముందుకు వచ్చిన వారిని, అభివృద్ధి పనులు చేయడానికి ఆసక్తి చూపుతున్న కాంట్రాక్టర్లను బెదిరిస్తూ రాజ్యాంగేతర శక్తులుగా తయారయ్యారని మండిపడ్డారు.