Share News

కాకినాడ-ఉప్పాడ తీర రక్షణకు చర్యలు

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:15 AM

కాకినాడ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, రక్షణ నిర్మాణ పనులు చేపట్టాలని జాతీయ విపత్తుల నివారణ సంస్థ చేసిన సూచనలపై రాష్ట్ర ప్రభుత్వం కదిలింది.

కాకినాడ-ఉప్పాడ తీర రక్షణకు చర్యలు
ap sachivalayam

  • 323 కోట్లతో పనులు చేపట్టనున్న ఏపీఎంబీ

  • పాలనా ఆమోదం తెలిపిన మౌలిక సదుపాయాల కల్పనా శాఖ

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): కాకినాడ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, రక్షణ నిర్మాణ పనులు చేపట్టాలని జాతీయ విపత్తుల నివారణ సంస్థ చేసిన సూచనలపై రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. కాకినాడ-ఉప్పాడ తీర ప్రాంతంలో తుఫానుల సమయంలో నిత్యం ఎదుర్కొంటున్న ‘కోత, ముంపు’ నివారణకు ఆ జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన ప్రతిపాదనలను అమలు చేయాలని రాష్ట్ర మారిటైమ్‌ బోర్డు(ఏపీఎంబీ) నిర్ణయించింది. రూ.323 కోట్లతో కాకినాడ-ఉప్పాడ మధ్య రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా సమీప ప్రాంతాల్లోని గ్రామాలు ముంపునకు గురై ప్రాణ, ఆస్తినష్టం కలుగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఎపీఎంబీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత పనులను ఏపీఎంబీ, కాకినాడ కలెక్టర్‌తో సమన్వయం చేసుకుంటూ చేపట్టాలని ఉత్తర్వు జారీ చేసింది.

Updated Date - Oct 08 , 2026 | 05:15 AM