పోలీసులూ బాధితులే..!
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:00 AM
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి కోట్ల రూపాయలు కాజేసిన ఆర్థిక మోసం కేసులో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలతోపాటు ..
స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పేరిట ఆర్థిక మోసం
బాధితుల ఫిర్యాదుతో కాకినాడలో కేసు నమోదు
సర్పవరం జంక్షన్, జూలై 1(ఆంధ్రజ్యోతి): స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి కోట్ల రూపాయలు కాజేసిన ఆర్థిక మోసం కేసులో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలతోపాటు పోలీసులు కూడా బాధితులుగా మారారు. కాకినాడ జిల్లాలో ఈ మోసం వెలుగు చూసింది. కాకినాడ ప్రధాన కేంద్రంగా ఆల్‌మైటీ జెనెసిస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పిఠాపురానికి చెందిన ఓ వ్యక్తి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నాడు. స్టాక్ మార్కెట్‌లో అధిక వడ్డీ, లాభాలు వస్తాయని ఆశ చూపి 3,060 మంది నుంచి రూ.47 కోట్లకుపైగా సేకరించి ట్రేడింగ్‌లో పెట్టుబడిగా పెట్టాడు. వీరిలో 45 మంది పోలీసులే ఉన్నారు. అయితే.. ఇన్వెస్టర్లకు లాభాలు, వడ్డీలు సకాలంలో చెల్లించకపోవడంతో బాధితులు సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.