పక్షం రోజులైనా వీడని మిస్టరీ
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:39 AM
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై పక్షం రోజులవుతున్నా ఆమె ఆచూకీ లభించకపోవడంతో..
కానరాని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. కన్నీటి నిరీక్షణలో తల్లిదండ్రులు
తుని రూరల్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై పక్షం రోజులవుతున్నా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రోజులు గడుస్తున్నకొద్దీ కేసు మరింత మిస్టరీగా మారుతుండగా, చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. జూన్6న అదృశ్యమైన జ్ఞానేశ్వరి కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కూతురి ఆచూకీ కోసం తల్లిదండ్రులు సుంకర గణేశ్, భవాని కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి అదృశ్యానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.