Share News

తీరని వేదన!

ABN , Publish Date - Jun 13 , 2026 | 04:35 AM

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఏడు రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో ఉత్కంఠత కొనసాగు తోంది.

తీరని వేదన!

  • వీడని జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీ

  • పెంపుడు కుక్కకు జీపీఎస్‌ ట్రాకర్‌

  • కొండప్రాంతాల్లో బృందాల గాలింపు

తునిరూరల్‌, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఏడు రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో ఉత్కంఠత కొనసాగు తోంది. బాలిక కోసం పోలీసులు, అటవీశాఖ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, రెవెన్యూ అధికారులు, గ్రామస్థులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆమె అదృశ్యమైన సమయంలో వెంట వెళ్లినట్లు భావిస్తున్న పెంపుడు కుక్క తిరిగి కనిపించడం కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా మారింది. ఆ కుక్కకు జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చిన అధికారులు దాని కదలికలను పరిశీలిస్తూ కొండ ప్రాంతాల్లో ప్రత్యేక గాలింపు నిర్వహిస్తున్నారు. మరోవైపు తమ పాపను ఎవరో తీసుకెళ్లి ఉండొచ్చని జ్ఞానేశ్వరి తల్లి అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. చిన్నారి ఆచూకీకి సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందించిన వారికి రూ.లక్ష నగదు బహుమతి అందజేస్తామని పోలీసుశాఖ ఇప్పటికే ప్రకటించింది. తల్లిదండ్రుల ఆవేదన, గ్రామస్థుల ఆందోళన మధ్య జ్ఞానేశ్వరి ఎక్కడనే ప్రశ్నకు సమాధానం కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది.

Updated Date - Jun 13 , 2026 | 04:36 AM