Share News

గణపయ్య ఎక్కినాడు.. పూల పల్లకి!

ABN , Publish Date - Sep 29 , 2026 | 06:27 AM

తూర్పుగోదావరి జిల్లా కడియపులంక అంతర్రాష్ట్ర పూలమార్కెట్‌లో సోమవారం గణపతి నిమజ్జనం ఊరేగింపు కోసం తయారు చేయించిన పూలరథం ఆకట్టుకుంది.

గణపయ్య ఎక్కినాడు.. పూల పల్లకి!
ganesha

గణపయ్య ఎక్కినాడు.. పూల పల్లకి!

కడియం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కడియపులంక అంతర్రాష్ట్ర పూలమార్కెట్‌లో సోమవారం గణపతి నిమజ్జనం ఊరేగింపు కోసం తయారు చేయించిన పూలరథం ఆకట్టుకుంది. తణుకు నుంచి పిలిపించిన 30 మందితో 3 రోజులు వాహనాన్ని ముస్తాబు చేయించారు. అలంకరణ కోసం గులాబీ, లిల్లీ పూలతో పాటు బెంగళూరు నుంచి సెంటు గులాబీ, ఆంథోరియం, జర్బేరా, డైజ్‌, తెల్లచామంతి, నీలం చామంతి వంటి పువ్వులు 2 వేల కేజీలు ఉపయోగించారు. రథంలో శివలింగం, రాధాకృష్ణుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. పూలరథానికి రూ.2.5 లక్షలు ఖర్చయిందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కడియపులంక, బుర్రిలంక గ్రామాల్లో ఊరేగించిన అనంతరం గణపయ్యను నిమజ్జనం చేశారు.

Updated Date - Sep 29 , 2026 | 06:37 AM