Share News

సీమ ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్న కూటమి

ABN , Publish Date - Jul 01 , 2026 | 05:31 AM

మాటలతో కాకుండా చేతలతో హామీలు నిలబెట్టుకునే ప్రభుత్వం తమదని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.

సీమ ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్న కూటమి

  • రాయలసీమ అభివృద్ధిలో కడప ఉక్కు కీలకం: బైరెడ్డి శబరి

అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): మాటలతో కాకుండా చేతలతో హామీలు నిలబెట్టుకునే ప్రభుత్వం తమదని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. జూలై 3న కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారని, రాయలసీమ అభివృద్ధిలో కడప స్టీల్‌ ప్లాంట్‌ కీలకంగా మారనుందని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఓసారి, సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందోసారి కడప స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపనలు చేసి, సీమ ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ రాయలసీమ ప్రజల ఆత్మగౌరవమని, దాన్ని కూటమి ప్రభుత్వం నిలబెడుతోందని అన్నారు. వేలాది మంది స్థానికులకు కడప స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగాలు కల్పించనుందని అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌కు విద్యుత్తు, రోడ్లు, నీటి వసతి వంటి మౌలిక వసతుల కల్పన తరువాతే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నామని తెలిపారు.

Updated Date - Jul 01 , 2026 | 05:31 AM