Share News

కడప ద్రోహి జగన్‌

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:30 AM

రెండు దశాబ్దాల కడప ప్రజల స్టీల్‌ప్లాంట్‌ ఆకాంక్షను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి అన్నారు.

కడప ద్రోహి జగన్‌

  • ఐదేళ్లలో ‘ఉక్కు’ నిర్మాణానికి ఒక్క ఇటుకా వేయలేదు

  • జూలై 3న కడప స్టీల్‌కు శంకుస్థాపన

  • రెండు దశాబ్దాల కడప ప్రజల కల నెరవేరుతోంది: భూమిరెడ్డి

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): రెండు దశాబ్దాల కడప ప్రజల స్టీల్‌ప్లాంట్‌ ఆకాంక్షను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించకపోతే ఓట్లు అడగను అని 2019లో మాట ఇచ్చి మడమ తిప్పిన వ్యక్తి జగన్‌రెడ్డి. 2019లో ఒకసారి, 2023లో మరోసారి స్టీల్‌ప్లాంట్‌ పేరుతో ప్రజలను మోసం చేసి, ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా వేయని కడప ద్రోహి జగన్‌. ఉత్తరాంధ్రకు విశాఖ స్టీల్‌ ఎలాగో రాయలసీమకు కడప స్టీల్‌ అలాంటిది. జూలై 3న రూ.16,350 కోట్ల పెట్టుబడితో 3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో కడప స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన జరగనుంది. 2028లోపు ఈ స్టీల్‌ ప్లాంట్‌ను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఈ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేస్తోంది. జగన్‌ రాయలసీమకు కాదు కదా పులివెందులకైనా ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఆయన తెచ్చింది ఏదైనా ఉందంటే అది 10రోజులు కూడా నడవని ఫిష్‌ ఆంధ్ర మాత్రమే. చంద్రబాబు, లోకేశ్‌ రాయలసీమను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు. సీమ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు గొడ్డలి పార్టీకి లేదు’ అని ఎమ్మెల్సీ విమర్శించారు.

Updated Date - Jun 30 , 2026 | 05:30 AM