Share News

పెద్దదస్తగిరి హత్య కేసులో లొంగిపోయిన నిత్యానందరెడ్డి

ABN , Publish Date - May 12 , 2026 | 05:11 AM

కడపలో సంచలనం సృష్టించిన పెద్దదస్తగిరి హత్య కేసులో నిందితుడు, వైసీపీ నేత బండి నిత్యానందరెడ్డి ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

పెద్దదస్తగిరి హత్య కేసులో లొంగిపోయిన నిత్యానందరెడ్డి

కడప, మే 11 (ఆంధ్రజ్యోతి): కడపలో సంచలనం సృష్టించిన పెద్దదస్తగిరి హత్య కేసులో నిందితుడు, వైసీపీ నేత బండి నిత్యానందరెడ్డి ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భూ లావాదేవీల్లో తేడాల కారణంగా అలంఖాన్‌పల్లెకు చెందిన వైసీపీ నేత పెద్దదస్తగిరిని గత నెల 6న రిమ్స్‌ ఆసుపత్రి ఆవరణలో కత్తులతో పొడిచి చంపారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసు నమోదు చేయగా... మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డిని కుట్రదారునిగా పేర్కొంటూ ఏ-13గా చేర్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిత్యానందరెడ్డి నెల రోజులుగా పోలీసులకు చిక్కలేదు. సోమవారం అనూహ్యంగా తన న్యాయవాది నాగిరెడ్డితో కలిసి ఎస్పీ కార్యాలయానికి వచ్చి పోలీసులకు లొంగిపోయాడు.

Updated Date - May 12 , 2026 | 05:11 AM