కడప 15వ డివిజన్‌లో రోడ్డు పనులకు శ్రీకారం
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:44 AM
కడప నగరంలోని 15వ డివిజన్ పరిధిలోని పుట్లంపల్లెచెరువు కట్ట వద్ద రూ.1.35 కోట్లతో చేపట్టనున్న 2.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు...
‘అక్షరం అండగా..’ కార్యక్రమానికి స్పందన
కడప మారుతీనగర్, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): కడప నగరంలోని 15వ డివిజన్ పరిధిలోని పుట్లంపల్లెచెరువు కట్ట వద్ద రూ.1.35 కోట్లతో చేపట్టనున్న 2.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్.మాధవి, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. గత నెల 18న 15వ డివిజన్‌లో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవి, పొలిట్‌బ్యూరో సభ్యుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని పలు సమస్యలను ప్రజలు వారి దృష్టికి తీసుకొచ్చారు. నెలరోజుల్లో రూ.1.45 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామని ఆరోజు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రోడ్డు పనులకు సోమవారం భూమిపూజ చేశారు.