Share News

గృహనిర్మాణ సంస్థ జీఎంగా రమేశ్‌

ABN , Publish Date - May 06 , 2026 | 04:26 AM

రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జనరల్‌ మేనేజర్‌ (పరిపాలన)గా కె.రమేశ్‌ను డిప్యుటేషన్‌పై నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గృహనిర్మాణ సంస్థ జీఎంగా రమేశ్‌

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జనరల్‌ మేనేజర్‌ (పరిపాలన)గా కె.రమేశ్‌ను డిప్యుటేషన్‌పై నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందుల వ్యవసాయ కళాశాలలో సాయిల్‌ సైన్స్‌, వ్యవసాయ, రసాయన శాస్త్ర విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రమేశ్‌.. గత కొంతకాలంగా ఏపీ స్టేట్‌ ఈబీసీ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌లో జనరల్‌ మేనేజరుగా డిప్యుటేషన్‌పై సేవలందిస్తున్నారు. తనను హౌసింగ్‌ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌గా నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ సమ్మతి తెలిపారు. దీంతో రమేశ్‌ను హౌసింగ్‌ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ (పరిపాలన)గా నియమిస్తూ గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న డిప్యూటి కలెక్టరు పి.వెంకటరమణను మాతృ శాఖకు పంపించారు.

Updated Date - May 06 , 2026 | 04:26 AM