Share News

గల్ఫ్‌లో తెలుగు వారికి అండగా ఉంటాం: నాగబాబు

ABN , Publish Date - Mar 23 , 2026 | 04:43 AM

అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో.. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారికి ఏ విధమైన ఆపద వచ్చినా జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వం..

గల్ఫ్‌లో తెలుగు వారికి అండగా ఉంటాం: నాగబాబు

అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో.. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారికి ఏ విధమైన ఆపద వచ్చినా జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కె.నాగబాబు స్పష్టం చేశారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న తెలుగు వారితో ఆదివారం వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆందోళనకు గురవుతున్న తెలుగు ప్రజలు, జనసైనికులు, వీర మహిళల్లో ధైర్యం నింపారు.

Updated Date - Mar 23 , 2026 | 04:44 AM