అమరావతిలో జ్యోతిరావు ఫూలే స్మృతి వనం
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:32 AM
అమరావతిలో మహాత్మా జ్యోతిరావు ఫూలే స్మృతి వనం నిర్మించనున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు.
ఏప్రిల్ 11న సీఎం శంకుస్థాపన: మంత్రి సవిత
గొల్లపూడి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో మహాత్మా జ్యోతిరావు ఫూలే స్మృతి వనం నిర్మించనున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. పలు బీసీ సంఘాల నేతలతో గొల్లపూడి బీసీ భవన్‌లో శనివారం మంత్రి సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 11న జ్యోతిరావు ఫూలే 200 జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఫూలే స్మృతి వనం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అమరావతిలో అయిదెకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. దీనికి మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరు పెట్టనున్నామని మంత్రి ప్రకటించారు.