Share News

జస్టిస్‌ ఊటుకూరు శ్రీనివాస్‌కు ఘనంగా వీడ్కోలు

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:14 AM

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఊటుకూరు శ్రీనివాస్‌కు శుక్రవారం హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. శుక్రవారంతో ఆయన పదవీకా లం ముగియడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి...

జస్టిస్‌ ఊటుకూరు శ్రీనివాస్‌కు ఘనంగా వీడ్కోలు

  • న్యాయ సేవలను కొనియాడిన చీఫ్‌ జస్టిస్‌

అమరావతి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఊటుకూరు శ్రీనివాస్‌కు శుక్రవారం హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. శుక్రవారంతో ఆయన పదవీకా లం ముగియడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో మొదటి కోర్టుహాలులో వీడ్కో లు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ శ్రీనివాస్‌ అందించిన న్యాయసేవలను చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ కొనియాడారు. జస్టిస్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. న్యా యమూర్తిగా వృత్తి జీవితం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్‌ జస్టిస్‌ శ్రీనివాస్‌ అందించిన న్యాయసేవలను కొనియాడారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్‌ శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్‌లు, అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ సాంబశివ ప్రతాప్‌, పీపీ మెండ లక్ష్మీనారాయణ, న్యాయవాదులు పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జస్టిస్‌ శ్రీనివాస్‌ దంపతులను ఘనంగా సత్కరించారు. సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్‌, ఉపాధ్యక్షుడు పీటారామన్‌, ప్రధాన కార్యదర్శి టి.కిరణ్‌, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 03:14 AM