మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:30 AM
సత్వర న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వానిది కీలకపాత్ర అని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ అన్నారు.
న్యాయవాదులకు శిక్షణలో జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్
అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): సత్వర న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వానిది కీలకపాత్ర అని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకుంటే కక్షిదారులకు శాశ్వత, సంతృప్తికరమైన ఉపశమనం లభిస్తుందన్నారు. సోమవారం హైకోర ్టు ప్రాంగణంలో మధ్యవర్తిత్వం పై న్యాయవాదులకు 40 గంటల శిక్షణను జస్టిస్ రాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు త్వరితగతిన న్యా యం అందించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థతో పాటు అధికారులపై ఉందన్నారు. వ్యవసాయ, వ్యాపార, వివాహ సంబంధ వివాదాల్లో మధ్యవర్తిత్వాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని కేసుల పరిష్కారానికి కృషి చేయాలని న్యాయవాదులను కోరారు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి మాట్లాడుతూ.. న్యాయవాదులు, మధ్యవర్తుల కృషి కారణంగా మధ్యవర్తిత్వ జాతీయ క్యాంపెయిన్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కరించగలిగామని, భవిష్యత్తులో నిర్వహించనున్న మధ్యవర్తిత్వ క్యాంపెయిన్ కూడా విజయవంతం చేయాలని కోరారు. న్యా యమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం పై నైపుణ్యం పెంచుకొనేందుకు న్యా యవాదులకు ఈ శిక్షణ కార్యక్రమం ఉత్తమ వేదికగా నిలుస్తుందన్నారు. శిక్షణకు హాజరైన న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ టీసీడీ శేఖర్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీకి చెందిన సీనియర్ ట్రైనర్లు ఎస్.అరుణాచలం, సందీప్ సక్సేనా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి బీవీఎస్ హిమబిందు, ఏపీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి జి.మాలతి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఉపకార్యదర్శి హెచ్.అమరరంగేశ్వరరావు పాల్గొన్నారు.