Share News

రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా న్యాయ సేవలు

ABN , Publish Date - Jan 27 , 2026 | 04:06 AM

రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా న్యాయసేవలు ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ అన్నారు.

రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా న్యాయ సేవలు

  • జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌

రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా న్యాయసేవలు ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ అన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా సోమవారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (లీగల్‌ సెల్‌ అథారిటీ) కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ మాట్లాడారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా న్యాయసేవాధికార సంస్థలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హిమబిందు, రాష్ట్ర న్యాయసేవల కమిటీ కార్యదర్శి మాలతి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 04:08 AM