Share News

లోకాయుక్తగా జస్టిస్‌ మల్లికార్జునరావు

ABN , Publish Date - Aug 26 , 2026 | 05:46 AM

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా నియమితులైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.

లోకాయుక్తగా జస్టిస్‌ మల్లికార్జునరావు

  • ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌

అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా నియమితులైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. తొలుత జీఏడీ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావును నియమిస్తూ గవర్నర్‌ జారీ చేసిన ఉత్తర్వును లోకాయుక్త రిజిస్ట్రార్‌ చదివి వినిపించారు. అనంతరం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని గవర్నర్‌ పూర్తి చేశారు. జస్టిస్‌ తల్లాప్రగడను... గవర్నర్‌, సీఎం అభినందించారు. కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, ఏపీ అసెంబ్లీ సెక్రటరీ ప్రసన్నకుమార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 05:48 AM