Share News

దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:26 AM

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ లీసా గిల్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఇంద్రకీలాద్రి(విజయవాడ), ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ లీసా గిల్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో జరిగిన పంచహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, అర్చకులు న్యాయమూర్తికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.

Updated Date - Apr 27 , 2026 | 05:26 AM