న్యాయవాదులు, న్యాయమూర్తులు కలిసి పనిచేస్తేనే కక్షిదారులకు న్యాయం
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:13 AM
రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్ లీసా గిల్‌ను హైకోర్టు అడ్వొకేట్...
హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో సీజే జస్టిస్ లీసా గిల్
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్ లీసా గిల్‌ను హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ బుధవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ.. న్యాయవాదులు, న్యాయమూర్తులు నాణేనికి బొమ్మ, బొరుసు వంటి వారని తెలిపారు. ఇరువురు కలిసి పనిచేస్తేనే కక్షిదారులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయంలో తన వంతు సహకారం అందిస్తానని, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడిషనల్ ఏజీ సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, అడ్వొకేట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పీటా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.