Share News

జస్టిస్‌ లిసా గిల్‌కు సీఎం శుభాకాంక్షలు

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:07 AM

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ లిసా గిల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.

జస్టిస్‌ లిసా గిల్‌కు సీఎం శుభాకాంక్షలు

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ లిసా గిల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా ఈ నియామకం ఓ చారిత్రాత్మక మైలురాయి అని సీఎం కొనియాడారు. న్యాయ రంగంలో జస్టిస్‌ లిసా గిల్‌ అత్యుత్తమ సేవలందించారని, సివిల్‌, క్రిమినల్‌, రాజ్యాంగపరమైన అంశాల్లో విశేష అనుభవం కలిగిన గిల్‌ నేతృత్వంలో చట్టబద్ధమైన పాలన మరింత బలోపేతమవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె పదవీకాలం విజయవంతంగా, స్ఫూర్తిదాయకంగా సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Updated Date - Apr 24 , 2026 | 05:07 AM