న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా జస్టిస్ లీసాగిల్
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:43 AM
ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ నియమితులయ్యారు.
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తిని ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించడం సంప్రదాయంగా వస్తోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌ను గవర్నర్ నామినేట్ చేస్తారు.