శ్రీబగళాముఖి అమ్మవారి సన్నిధిలో జస్టిస్ కిరణ్మయి
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:34 AM
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీబగళాముఖి అమ్మవారి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి..
పిట్టలవానిపాలెం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీబగళాముఖి అమ్మవారి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి ఆదివారం దర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ కార్యనిర్వాహణాధికారి జి.నరసింహమూర్తి, దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ కలకోట చక్రధర్‌రెడ్డి జస్టిస్ కిరణ్మయికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు.