శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ జేకే మహేశ్వరి
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:13 AM
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి శుక్రవారం వేకువజామున ఆలయంలో జరిగిన అభిషేకసేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, జూన్ 5(ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి శుక్రవారం వేకువజామున ఆలయంలో జరిగిన అభిషేకసేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆయన్ను వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. ఆయనతో పాటు మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను వీరు సందర్శించారు.