శ్రీబగళాముఖి సేవలో జస్టిస్ హరిహరనాథ్ శర్మ
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:19 AM
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీబగళాముఖి అమ్మవారి దేవస్థానంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి...
పిట్టలవానిపాలెం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీబగళాముఖి అమ్మవారి దేవస్థానంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అవధానం హరిహరనాథ్ శర్మ కుటుంబ సమేతంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగిన శ్రీబగళాముఖి అమ్మవారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తే దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని వీఐపీ విజిటర్స్ డైరీలో ఆయన సూచించారు. జస్టిస్ హరిహరనాథ్ శర్మ దంపతులను ఆలయ కార్యనిర్వాహణాధికారి జి.నరసింహమూర్తి ఘనంగా సత్కరించారు.