Share News

రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాలు రాజ్యాంగ పరిధికి లోబడే ఉండాలి

ABN , Publish Date - Jan 27 , 2026 | 04:16 AM

రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాలు రాజ్యాంగ పరిధికి లోబడే ఉండాలని సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాలు రాజ్యాంగ పరిధికి లోబడే ఉండాలి

  • సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ గోపాలగౌడ సూచన

మదనపల్లె టౌన్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాలు రాజ్యాంగ పరిధికి లోబడే ఉండాలని సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ అభిప్రాయపడ్డారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రసంగం అనంతరం న్యాయవాదులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన వివరంగా సమాధానాలు ఇచ్చారు. గవర్నర్ల స్థానాల్లో ఉన్నవారు గౌరవ, మర్యాదలను కాపాడుకోవాలని జస్టిస్‌ గోపాలగౌడ సూచించారు. న్యాయాధికారులు ఎగ్జిక్యూటివ్‌ ఒత్తిళ్లకు లోనుకాకుండా రాజ్యాంగం, చట్టాలకు అనుగుణంగా, ధైౖర్యంగా తీర్పులు ఇవ్వాలని స్పష్టం చేశారు. పదవీ విరమణ తర్వాత న్యాయాధికారులు ప్రభుత్వ పదవులు స్వీకరించడం తగదన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 04:17 AM