పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:03 AM
పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ పిలుపునిచ్చారు.
నక్షత్ర వనాన్ని సందర్శించిన జస్టిస్ కృష్ణమోహన్
చిలకలూరిపేట, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని నక్షత్ర వనాన్ని ఆయన తన సతీమణితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నక్షత్ర వనంలో ఆయన మొక్కలు నాటారు. పచ్చని ప్రకృతి మధ్య గడపడం వల్ల కలిగే ఉత్సాహం వెలకట్టలేనిదన్నారు. పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా మనం నేడు నాటే ప్రతి మొక్క భావితరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే నిధిలా మారుతుందని పేర్కొన్నారు.