ఏపీ హైకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్‌గా జస్టిస్ బట్టు దేవానంద్
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:32 AM
ఏపీ హైకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్‌గా న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ నియమితులయ్యారు.
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్‌గా న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ నియమితులయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏపీ న్యాయసేవాధికార సంస్థ పాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ లిసాగిల్ ఆయనను నియమించారు. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.