నేడు ఇంటర్ కాలేజీలు పునఃప్రారంభం
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:00 AM
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కాలేజీలు శనివారం పునఃప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం జూన్ 1నే కాలేజీలు పునఃప్రారంభమవుతాయి.
ముగిసిన సప్లిమెంటరీ పరీక్షలు.. రేపటి నుంచి మూల్యాంకనం
అమరావతి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కాలేజీలు శనివారం పునఃప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం జూన్ 1నే కాలేజీలు పునఃప్రారంభమవుతాయి. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం(ఈ నెల 5వ తేదీ) వరకు కొనసాగడంతో ఐదు రోజులు ఆలస్యంగా కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. ఫస్టియర్ విద్యార్థులు 34,914 మంది, సెకండియర్ విద్యార్థులు 91,268 మంది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. సప్లిమెంటరీ పత్రాల మూల్యాంకనం ఆదివారం ప్రారంభించనున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా తెలిపారు.