Share News

పార్టీ ఆశయాలు నచ్చడంతోనే చేరికలు

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:37 PM

భారతీయ జనతా పార్టీ ఆశయాలు నచ్చడంతో అనేక ప్రాంతాల ప్రజలు బీజేపీలోనికి చేర డానికి ఉత్సాహం చూపిస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.

పార్టీ ఆశయాలు నచ్చడంతోనే చేరికలు
బీజేపీలో చేరుతున్న హానవాళు గ్రామస్థులు

ఆదోని టౌన, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : భారతీయ జనతా పార్టీ ఆశయాలు నచ్చడంతో అనేక ప్రాంతాల ప్రజలు బీజేపీలోనికి చేర డానికి ఉత్సాహం చూపిస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఆదివారం క్యాంప్‌ కార్యాలయం వద్ద బీజేపీ రూరల్‌ నాయకులు వేణుగోపాల్‌, ఆచారి, ఆధ్వర్యంలో వైసీపీ నుంచి వీరభద్రస్వామి, నారాయణ, వెంకటేష్‌, నాగరాజు, వెంకప్ప, ఆంజనేయ, ఈశ్వర్‌, రామలింగ, మల్లేష్‌, తదితర నాయకులతో పాటు దాదాపు 30 కుటుంబాలు ఆ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం ఇంటి స్థలాలు లేని పేద కుటుంబాలు జిల్లా జనాభాలో 50 శాతం దాకా ఉన్నారని, ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాల తోపాటు నిర్మాణం కూడా చేయడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ విలువైన స్థలాలను కబ్జాలు చేసిన వారి భరతం పడతానని, వాటిని తిరిగి స్వాఽధీనం చేసుకుని ఇంటి స్థలాలు లేని పేదలకు ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. దీనిపై కొందరు ప్రతిపక్ష నాయకులు వదంతులు సృష్టిస్తున్నారని, వాటిని తాను ఏ మాత్రం పట్టించుకునే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి విశ్వనాథం, రామకృష్ణ, ఆచారి, గోవిందు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 11:37 PM