Share News

జోగి ఫ్యామిలీపై కోడలి కేసు

ABN , Publish Date - Jul 25 , 2026 | 04:52 AM

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్‌ మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు మొత్తం 11 మందిపై కోడలు మేఘన ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.

జోగి ఫ్యామిలీపై కోడలి కేసు

  • గృహ హింస, హత్యాయత్నం, వేధింపులు

  • మొత్తం 11 మందిపై మేఘన ఫిర్యాదు

  • పెళ్లయిన నెల రోజుల నుంచే వేధింపులు

  • 5 కోట్లు అదనపు కట్నం తేవాలని డిమాండ్‌

  • బంధించి చిత్రహింసలు పెట్టడంతో పాటు

  • హత్యాయత్నం కూడా చేశారని ఆరోపణలు

విజయవాడ, జూలై 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్‌ మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు మొత్తం 11 మందిపై కోడలు మేఘన ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన మేఘనకు జోగి రమేశ్‌ పెద్దకుమారుడు రాజీవ్‌తో 2025 మే 28న వివాహమైంది. పెళ్లయిన నెల నుంచే వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల పంచాయితీతో తిరిగి భర్త వద్దకు వచ్చారు. ఆ తర్వాత చిత్రహింసలు పెట్టడంతో పాటు హత్యాయత్నం కూడా చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. వేధింపులు ఆపాలంటే అదనంగా రూ.5 కోట్ల కట్నం తీసుకురావాలని డిమాండ్‌ చేశారని మేఘన ఆరోపించారు. తన ఫిర్యాదులో భర్త రాజీవ్‌తో పాటు అత్తమామలు జోగి రమేశ్‌, శకుంతల, మరిది రోహిత్‌, ఆడపడుచు ప్రియాంక, జోగి సోదరుడు రాము, ఆయన కుమారులు రాకేశ్‌, పండు, రమేశ్‌ బావమరిది స్వామి, ఆయన భార్య రమ, స్వామి కుమారుడు సంతోశ్‌ పేర్లను కూడా ప్రస్తావించారు. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Jul 25 , 2026 | 04:55 AM