జోగి ఓ మానసిక రోగి: నాదెండ్ల బ్రహ్మం
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:51 AM
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు సవాళ్లు విసిరే స్థాయి జోగి రమేశ్‌కు లేదని కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం అన్నారు.
అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు సవాళ్లు విసిరే స్థాయి జోగి రమేశ్‌కు లేదని కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. ‘నకిలీ మద్యం కేసులో బెయిలుపై బయటకు వచ్చిన జోగి మానసిక రోగిలా మాట్లాడుతున్నాడు. తప్పుడు పనులు చేసి అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు ప్రమాణాలు చేస్తానంటూ సవాళ్లు విసరడం హాస్యాస్పదం. రమేశ్ వైసీపీ హయాంలో చేసిన అక్రమాలన్నీ త్వరలో బయటకు వస్తాయి’ అని బ్రహ్మం అన్నారు.