Share News

తంబళ్లపల్లె కోర్టుకు జోగి సోదరులు

ABN , Publish Date - Feb 17 , 2026 | 04:23 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో విచారణకు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు జోగి రాము అన్నమయ్య జిల్లాలోని...

తంబళ్లపల్లె కోర్టుకు జోగి సోదరులు

ములకలచెరువు, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో విచారణకు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు జోగి రాము అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులైన జోగి సోదరులకు తంబళ్లపల్లె జూనియర్‌ సివిల్‌ కోర్టు గత నెల 23న బెయిల్‌ మంజూరు చేయడంతో విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలో సోమవారం కోర్టు వాయిదాకు హాజరుకావడానికి వారు తంబళ్లపల్లెకు వచ్చారు.

Updated Date - Feb 17 , 2026 | 04:23 AM