ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు రష్యాలో ఉద్యోగాలు
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:03 AM
ఐటీఐ, డిప్లొమా కోర్సులు చేసినవారికి రష్యాలో షీట్ మెటల్ వర్కర్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్ ఉద్యోగాకాశాలు కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.మనోహర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు
ప్రకటించిన నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఐటీఐ, డిప్లొమా కోర్సులు చేసినవారికి రష్యాలో షీట్ మెటల్ వర్కర్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్ ఉద్యోగాకాశాలు కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.మనోహర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒక సంవత్సరం ఒప్పందంతో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారని, తర్వాత ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెలకు 60వేల రూబుళ్లు (సుమారు రూ.72వేలు) జీతం వస్తుందని, అదనంగా ఆహార భత్యం కింద మరో 10 వేల రూబుళ్లు ఇస్తారని తెలిపారు. ఉచిత వసతి కల్పిస్తారని, విమాన ప్రయాణ ఖర్చులు, తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణ ఖర్చులు కంపెనీయే భరిస్తుందన్నారు. ఉచిత వైద్య బీమా సౌకర్యం కూడా ఉంటుందని వివరించారు. అభ్యర్థులు ‘ఏపీనైపుణ్యం’ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9988853335, 8712655686 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.