జెత్వాని కేసులో అభ్యంతరాలపై విచారణ 2కు వాయిదా
ABN , Publish Date - Aug 20 , 2026 | 04:50 AM
ముంబై నటి కాదంబరి జెత్వానిపై నమోదైన కేసులో వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ (కేవీఎస్) దాఖలు చేసిన అభ్యంతరాలపై విచారణ 2వ తేదీకి వాయిదా పడింది.
విజయవాడ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జెత్వానిపై నమోదైన కేసులో వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ (కేవీఎస్) దాఖలు చేసిన అభ్యంతరాలపై విచారణ 2వ తేదీకి వాయిదా పడింది. తనను బ్లాక్‌మెయిల్ చేసి కోట్లాది రూపాయలు జెత్వాని వసూలు చేశారని విద్యాసాగర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో జెత్వానితో పాటు ఆమె తల్లిదండ్రులు ఆశా జెత్వాని, నరేంద్రకుమార్ జెత్వాని, సోదరుడు అంబరీశ్ జెత్వాని నిందితులుగా ఉన్నారు. కాదంబరి జెత్వానీని తప్ప మిగిలిన ముగ్గురిని నిందితుల జాబితా నుంచి తొలగిస్తున్నట్టు సీఐడీ కోర్టుకు తెలిపింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేవీఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీఐడీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై వాదనలను వచ్చే నెల రెండో తేదీకి కోర్టు వాయిదా వేసింది.