మున్సిపల్ ప్రత్యేకాధికారిగా జేసీ బాధ్యతలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:47 PM
ఆదోని పురపాలక సంఘం ప్రత్యేకాధికారిగా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ బాధ్యత చేపట్టారు.
ఆదోని, ఏప్రిల్ 10 (ఆంధ్ర జ్యోతి): ఆదోని పురపాలక సంఘం ప్రత్యేకాధికారిగా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ బాధ్యత చేపట్టారు. మున్సిపల్ పాలకమండలి గడువు ముగియడంతో శుక్రవారం ప్రత్యే కా ధికారి హోదాలో తొలిసారి పట్టణా నికి ఆయన వచ్చారు. ఈ సంద ర్భంగా జేసీని ఎమ్మెల్సీ, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ బీటీ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానిం చారు. అనంతరం పట్టణ సమస్యలపై చర్చించారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జేసీని కోరారు. పెండింగ్‌లో ఉన్న పట్టణ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని విన్నవించారు. కార్యక్రమంలో సక్రప్ప, నాగరాజు స్వామి, ఆనంద్, వీరేష్, హుసేన్‌బాషా, కుమార్, గోపి పాల్గొన్నారు.
పట్టణ ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తా
ఆదోని టౌన : పట్టణ ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తానని ఆదోని మునిసిపాలిటీ స్పెషల్ ఆఫీసర్, జేసీ నూరల్‌ఖమర్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే పార్థసారథిలో కలిసి వివిధ శాఖల అఽధికారుల పనితీరుపై సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఆక్రమణల తొలగింపుపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం గురించి టౌన ప్లానింగ్ అధికారులతో చర్చిస్తానన్నారు. కార్యక్రమంలో కమిషనర్ నయీమ్ మహమ్మద్ పాల్గొన్నారు.
మరో ఎస్‌ఎస్‌ట్యాంక్ నిర్మించాలి
ఆదోని టౌన : పట్టణ జనాభాకు అనుగుణంగా మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాలని సీపీఎం నాయకులు కోరారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌ను కలిసి వినతిపత్రం అందజేశా రు. అలాగే పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కా ర్య క్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, నాయకులు గోపాల్, తిప్పన్న వీరేష్, వెంకటేష్, నాగరాజ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఇండోర్ స్టేడియం పనులను ప్రారంభించాలి
ఆదోని అగ్రికల్చర్ : పట్టణంలోని విట్టా కిష్టప్ప నగర్‌లో అర్థాంతరంగా ఆగిపోయిన ఇండోర్ స్టేడియం పనులను ప్రారంభించాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు కోరారు. శుక్రవారం కార్యా లయంలో జేసీ నూరూల్ కమర్‌ను కలిసి వినతిపత్రం అం దజేశారు. నాయకులు సంజయ్, శశిదర్, జగన పాల్గొన్నారు.