విశాఖలో జపాన్ ఐటీ దిగ్గజం
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:15 AM
జపాన్‌కు చెందిన నిప్పన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్(ఎన్‌టీటీ) డేటా సంస్థ విశాఖపట్నంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్(జీసీసీ)ని ఏర్పాటు చేస్తోంది.
నేడు ఎన్‌టీటీ డేటా జీసీసీ ప్రారంభం
విశాఖపట్నం, జూలై 8(ఆంధ్రజ్యోతి): జపాన్‌కు చెందిన నిప్పన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్(ఎన్‌టీటీ) డేటా సంస్థ విశాఖపట్నంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్(జీసీసీ)ని ఏర్పాటు చేస్తోంది. మొబైల్, ఇంటర్నెట్, ఐటీ, కన్సల్టెన్సీ, ఏఐ, ఫొటోనిక్స్ రంగాల్లో సేవలు అందిస్తున్న ఈ సంస్థ 190 దేశాల్లో విస్తరించి ఉంది. మొత్తం 70 దేశాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంది. రుషికొండ ఐటీ పార్కు హిల్ నంబరు-2పై ఉన్న ‘ఇన్‌స్పైర్‌ఎడ్జ్’ భవనంలో కొంత భాగాన్ని లీజుకు తీసుకుంది. అందులో గురువారం కార్యాలయాన్ని ప్రారంభిస్తోంది. ఐటీ మంత్రి లోకేశ్ సమక్షంలో దీనిని ప్రారంభించాలని భావించారు. కానీ ఎందుకనో గురువారం సాధారణంగా కార్యకలాపాలు మొదలు పెడుతున్నారు.