Share News

జనసేన నిర్మాణ ప్రక్రియ ఆరంభం

ABN , Publish Date - Jun 23 , 2026 | 05:41 AM

జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ‘సమాచార సేకరణ కమిటీ’లను అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు చేశారు.

జనసేన నిర్మాణ ప్రక్రియ ఆరంభం

  • 25 సమాచార సేకరణ కమిటీలు.. 29 నుంచి దరఖాస్తులు

అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ‘సమాచార సేకరణ కమిటీ’లను అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు చేశారు. వీరికి సహాయకులుగా ముగ్గురు సీనియర్‌ నాయకులను, ముగ్గురు సాధకులు, 21 మంది సమన్వయకర్తలను నియమించారు. ఈ కమిటీలు 29 నుంచి పార్టీ ఉన్నతి కోసం తొలి నుంచి తపించిన జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పదవుల కోసం చేసుకున్న దరఖాస్తులను ఈ కమిటీ స్వీకరించి అధినేతకు అందజేస్తుంది.

Updated Date - Jun 23 , 2026 | 05:41 AM