Share News

బాధ్యతగా సభ్యత్వ నమోదు

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:04 AM

‘‘జనసేన పార్టీ సభ్యత్వ నమోదు అనేది మహోన్నత ఆశయాలతో నిండిన యజ్ఞం. పార్టీ సిద్ధాంతాలను నమ్మిన ప్రతి ఒక్క జనసైనికుడు, వీర మహిళ ఆ సభ్యత్వ నమోదును భావోద్వేగంతో చేస్తారు.

బాధ్యతగా సభ్యత్వ నమోదు

  • జనసేన నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి మనోహర్‌ సూచన

అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ‘‘జనసేన పార్టీ సభ్యత్వ నమోదు అనేది మహోన్నత ఆశయాలతో నిండిన యజ్ఞం. పార్టీ సిద్ధాంతాలను నమ్మిన ప్రతి ఒక్క జనసైనికుడు, వీర మహిళ ఆ సభ్యత్వ నమోదును భావోద్వేగంతో చేస్తారు. మనమంతా బాధ్యతగా దానిని ముందుకు తీసుకెళ్లాలి’’ అని జనసేన నేతలకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌, మంత్రి మనోహర్‌ సూచించారు. జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమన్వయకర్తలతో మనోహర్‌ శనివారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. క్షేత్రస్థాయి నుంచి పక్కా ప్రణాళికతో సభ్యత్వ నమోదును అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు మీద ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దృష్టి నిలపాలని, శాసన సభ, మండలి సమావేశాలకు హాజరవుతూనే, మిగిలిన సమయాన్ని పూర్తిగా పార్టీకి కేటాయించాలని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి బలాన్ని సమీకరించేలా ఈ బాధ్యతను నిర్వర్తించాలన్నారు. సభ్యత్వ నమోదు సమన్వయం కోసం పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను పార్టీ అధ్యక్షుడు పవన్‌ సూచన మేరకు నియమించామని తెలిపారు.


25 పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్తలు వీరే..

శ్రీకాకుళం- కొరికాన రవికుమార్‌, విజయనగరం -లోకం నాగమాధవి, విశాఖపట్నం- సి.హెచ్‌.వంశీకృష్ణ యాదవ్‌, అనకాపల్లి- పంచకర్ల రమేశ్‌బాబు, అరకు- సుందరపు విజయ్‌కుమార్‌, కాకినాడ- తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, అమలాపురం- బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి- కందుల దుర్గేష్‌, నరసాపురం- చిల్లపల్లి శ్రీనివాసరావు, ఏలూరు- గిడ్డి సత్యనారాయణ, విజయవాడ- బొమ్మిడి నాయకర్‌, మచిలీపట్నం- వల్లభనేని బాలశౌరి, గుంటూరు - పిడుగు హరిప్రసాద్‌, నరసరావుపేట- పంతం నానాజీ, బాపట్ల- పత్సమట్ల ధర్మరాజు, ఒంగోలు - కొణతాల రామకృష్ణ, నెల్లూరు- బొలిశెట్టి శ్రీనివాస్‌, కడప- టి.సి.వరుణ్‌, రాజంపేట- కళ్యాణం శివశ్రీనివాసరావు, కర్నూలు- చిలకం మధుసూదన్‌రెడ్డి, నంద్యాల- కిలారు రోశయ్య, అనంతపురం- పి.హరిప్రసాద్‌, హిందూపురం- ఎస్‌.కె.రియాజ్‌, చిత్తూరు- వేగుళ్ల లీలాకృష్ణ, తిరుపతి- ఆరణి శ్రీనివాసులు

Updated Date - Feb 22 , 2026 | 05:05 AM