జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:53 AM
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. పార్టీ నేతలుకు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఇతర నేతలు పాల్గొన్నారు.