గిరిపుత్రుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:02 AM
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈసారి గిరిపుత్రుల మధ్య నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
నేడు పాడేరుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈసారి గిరిపుత్రుల మధ్య నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు. శనివారం పాడేరు నియోజకవర్గం, నందిగురువు గిరిజన గ్రామంలో నిర్వహించే వేడుకల్లో ఆయన పాల్గొంటారు. పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామస్థాయిలో జరిగే వేడుకల్లో పవన్ స్వయంగా పాల్గొంటారు.