Share News

కంటెంట్‌ రైటర్స్‌ కావలెను

ABN , Publish Date - Jun 29 , 2026 | 05:32 AM

సమకాలీన సామాజిక, రాజకీయ, పాలనాపరమైన అంశాలపై అవగాహన ఉండి, తెలుగు, ఆంగ్ల భాషల్లో రాయగలిగి, కంటెంట్‌ రూపొందించాలనే ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది.

కంటెంట్‌ రైటర్స్‌ కావలెను

  • ప్రకటన జారీ చేసిన జనసేన పార్టీ

అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): సమకాలీన సామాజిక, రాజకీయ, పాలనాపరమైన అంశాలపై అవగాహన ఉండి, తెలుగు, ఆంగ్ల భాషల్లో రాయగలిగి, కంటెంట్‌ రూపొందించాలనే ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన జారీ చేసింది. తమకు ఆసక్తి సాధికారత ఉన్న అంశాలపై కంటెంట్‌ అందించవచ్చునని పేర్కొంది. పార్టీలోని మీడియా, సోషల్‌ మీడియా విభాగాలతో కలిసి కంటెంట్‌ రైటర్స్‌గా సేవలు అందించాలనుకునే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కంటెంట్‌ రైటర్స్‌ ఎంపిక కోసం దరఖాస్తులను జూలై 5వ తేదీ నాటికి ‘సెంట్రల్‌ ఆపరేషన్‌ ఎట్‌ జనసేన పార్టీ.ఓఆర్‌జీకి’ మెయిల్‌ చేయాలని తెలిపింది. అభ్యర్థుల బయోడేటాతో పాటు ఏదైనా సమకాలీన సామాజిక, రాజకీయ, పాలనాపరమైన అంశంపై 200 పదాలకు మించకుండా వ్యాసం తప్పనిసరిగా రాసి పంపించాలని కోరింది.

Updated Date - Jun 29 , 2026 | 05:48 AM