సాక్షి తప్పుడు కథనాలపై ఫిర్యాదు చేశా: విజయకుమార్
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:57 AM
తనపై సాక్షి పత్రికలో రాస్తున్న తప్పడు కథనాలపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశానని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తెలిపారు.
తనపై సాక్షి పత్రికలో రాస్తున్న తప్పడు కథనాలపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశానని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తెలిపారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకుంటే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాంబిల్లిలో డీ పట్టా భూముల అంశం అంతా చట్టప్రకారమే జరిగిందన్నారు. రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న భూమికి తనకేం సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన సభలో కూడా మాట్లాడారు.