పునర్విభజనపై జనసేన కీలక భేటీ
ABN , Publish Date - May 15 , 2026 | 05:07 AM
రాష్ట్రంలో రానున్న పురపాలక, నగర పాలక, నగర పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన వార్డులు, డివిజన్ల పునర్విభజనపై జనసేన పార్టీ కమిటీ గురువారం భేటీ అయింది.
నివేదికను అధినేత పవన్‌కు అందించనున్న సభ్యులు
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో రానున్న పురపాలక, నగర పాలక, నగర పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన వార్డులు, డివిజన్ల పునర్విభజనపై జనసేన పార్టీ కమిటీ గురువారం భేటీ అయింది. విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కమిటీ అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయింది. వచ్చిన నివేదికలు, కూటమి స్ఫూర్తిని కొనసాగించేలా స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ వివరాలను అధినేత పవన్ కల్యాణ్‌కు నివేదించనున్నారు. సమావేశంలో ఆయా కమిటీల సభ్యులు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ, ఉభయగోదావరి నుంచి పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, కొటికలపూడి గోవిందరావు, సామినేని ఉదయభాను పాల్గొన్నారు.