Share News

కేరళలోనూ జనసేన విస్తరణ: నాగబాబు

ABN , Publish Date - Apr 20 , 2026 | 04:15 AM

ఇతర రాష్ట్రాల్లో కూడా జనసేన విధానాలు అవలంబించి, పార్టీని విస్తరించుకోవాలని ప్రజలు అనుకోవడం శుభపరిణామమని జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగబాబు అన్నారు.

కేరళలోనూ జనసేన విస్తరణ: నాగబాబు

  • 200 మంది స్థానికులు జనసేనలో చేరిక

అమరావతి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాల్లో కూడా జనసేన విధానాలు అవలంబించి, పార్టీని విస్తరించుకోవాలని ప్రజలు అనుకోవడం శుభపరిణామమని జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగబాబు అన్నారు. కేరళలోని జనసేన నాయకుల అభ్యర్థన, అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్‌తో కలిసి ఆదివారం ఆ రాష్ట్రంలో పర్యటించారు. తిరువనంతపురంలో జరిగిన సమావేశంలో పాల్గొని స్థానిక నాయకులతో చర్చించారు. అనంతరం ఇతర పార్టీలకు చెందిన సుమారు 200 మంది స్థానిక నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. నాగబాబు, తాళ్లూరి రామ్‌ కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో జనసేన యువజన నాయకుడు గోకుల రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 04:16 AM