‘కల్తీ నెయ్యి’లో వెలంపల్లి పాత్ర !
ABN , Publish Date - Feb 05 , 2026 | 06:20 AM
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో వైసీపీ నేత వెలంపల్లి శ్రీనివాసరావు పాత్ర ఉందని జనసేన సెంట్రల్ ఆంధ్రా జోన్ కన్వీనర్ బాడిత శంకర్ బుధవారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఏసీబీకి జనసేన ఫిర్యాదు
విజయవాడ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో వైసీపీ నేత వెలంపల్లి శ్రీనివాసరావు పాత్ర ఉందని జనసేన సెంట్రల్ ఆంధ్రా జోన్ కన్వీనర్ బాడిత శంకర్ బుధవారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో దేవదాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కోటాలో వస్త్రం, అభిషేకం, తోమాల, సుప్రభాత సేవలను సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఆయనకు భోలేబాబాతో సంబంధాలు ఉన్నాయని.. శ్రీవాణి టికెట్లను అధిక ధరలకు విక్రయించారని తెలిపారు. దుర్గగుడి ఈవోగా సురేశ్‌బాబు ఉన్న సమయంలో అమ్మవారి సొమ్ము రూ.100 కోట్లను వివిధ మార్గాల్లో వెలంపల్లికి చేరేలా అక్రమాలు చేశారని పేర్కొన్నారు.